Share News

దర్యాప్తు పక్కదారి పట్టించేలా.. సీఐడీ కస్టడీలో చైతన్య సమాధానాలు దర్యాప్తు పక్కదారి పట్టించేలా.. సీఐడీ కస్టడీలో చైతన్య సమాధానాలు

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:43 AM

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు,

దర్యాప్తు పక్కదారి పట్టించేలా.. సీఐడీ కస్టడీలో చైతన్య సమాధానాలు దర్యాప్తు పక్కదారి పట్టించేలా.. సీఐడీ కస్టడీలో చైతన్య సమాధానాలు

అధికారుల ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు

గుంటూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను సీఐడీ అధికారులు విచారించారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న చైతన్యను మూడు రోజుల కస్టడీలో భాగంగా సీఐడీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆయన న్యాయవాది సమక్షంలో సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, సీఐలు విచారించారు. ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా దర్యాప్తును పక్కదారి పట్టించేలా చైతన్య సమాధానాలు చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో అప్పిరెడ్డి అనుచరులను, ఆయన వర్గీయులను సమీకరించడంలో పానుగంటి చైతన్య కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే పోలీసు అధికారుల విచారణలో తేలింది. అయినప్పటికీ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో అప్పిరెడ్డి ప్రమేయం లేదని, తనను వైసీపీ నాయకుడు నూనె ఉమామహేశ్వర రెడ్డి తీసుకువెళ్లారని సీఐడీ అధికారుల విచారణలో పానుగంటి చైతన్య చెప్పారు. ‘పని ఉంది.. బయటకు వెళ్లి వద్దామని నన్ను, నా అనుచరులను ఉమామహేశ్వరరెడ్డి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఆ సమయంలో కూడా టీడీపీ కార్యాలయంపై దాడి చేయబోతున్నట్లు నాకు చెప్పలేదు’ అని చైతన్య అధికారులకు చెప్పారు. టీడీపీ కార్యాలయం వద్దకు వెళ్లిన తర్వాతే దాడి చేయాలని చెప్పినట్లు తెలిపారు. దాడికి తాను ఎవరిని తీసుకువెళ్లలేదన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 06:42 AM