కేంద్ర మంత్రి పదవుల్లోనూ రాష్ట్రానికి అన్యాయమే: సీపీఐ
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:55 AM
గత పదేళ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపులో కూడా ఏపీకి అన్యాయమే చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

అమరావతి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): గత పదేళ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపులో కూడా ఏపీకి అన్యాయమే చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఏపీకి ఒకే ఒక్క పూర్తిస్థాయి మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, ఇద్దరికి సహాయ మంత్రి పదవులు కేటాయించినప్పటికీ అవి అలంకార ప్రాయమేనని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏమాత్రం ప్రయోజనం లేని పౌర విమానయాన శాఖను ఏపీకి కేటాయించడం విచారకరమన్నారు.