ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Aug 10 , 2024 | 12:05 AM
ఏపీ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవారం పట్టణంలో ప్రపం చ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మదనపల్లె అర్బన, ఆగస్టు 9: ఏపీ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవారం పట్టణంలో ప్రపం చ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి సంఘం నాయకులు పూ లమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్ నుంచి మల్లికార్జున సర్కిల్ వరకు ర్యాలీ నిర్వ హించారు. స్థానిక ఎన్జీవో హోంలో ఏపీ జీవైఎస్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడింట్ గడ్డం శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివాసీ వర్గాల సంప్రదాయాలు, సాం స్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవాధ్యక్షుడు జానం గంగిరెడ్డి, రాష్ట్ర కోశాధికారి టేకుమంద రెడ్డెప్ప, నాయకులు కిల్లా విజయకుమార్, రాజేష్, సంఘం మహిళా రాష్ట్ర కార్యదర్శి నారాయణమ్మ, మండల సంఘం అధ్యక్షుడు స్టుడియో మధు, కొండయ్య, వెంకటే్‌ష్, జలకం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
పీలేరులో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారు గిరిజన, దళిత సంఘాలు ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ గిరిజన యా నాది సేవా సంఘం(ఏపీజీవైఎస్‌ఎస్) ఆధ్వ ర్యంలో గిరిజన, దళిత సంఘ నేతలు స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలతో నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షు డు పులి శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు జానం గంగి రెడ్డి మాట్లాడుతూ విద్యా, ఆరోగ్య సేవలు పొందడంతో ఆదివాసీలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని వాపోయారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీవైఎస్‌ఎస్ నాయకులు ఆదినారాయణ, కిల్లా విజయ్ కుమార్, దళిత నాయకులు ధరణీ కుమార్, బాస్ నాయకులు పూలకుంట శ్రీనివాసులు, గట్టప్ప, గండికోట వెంకటేశ, బీసీ నేతలు మహేశ యాదవ్, షాహినషా, బుజ్జు, తదితరులు పాల్గొన్నారు.