Share News

పాయల్‌ కపాడియాపై కేసులు ఎత్తేయాలి

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:28 AM

కేన్‌ ్స అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రానికి గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును అందు కున్న దర్శకురాలు పాయల్‌ కపాడియాపై కేసులను ఎత్తేయాలని, ఆమెకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ప్రజానాట్యమండలి రౌండ్‌ టేబుల్‌ సమావే శంలో వక్తలు డిమాండ్‌ చేశారు.

పాయల్‌ కపాడియాపై కేసులు ఎత్తేయాలి

ప్రజానాట్యమండలి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌

విజయవాడ కల్చరల్‌, జూన్‌ 2: కేన్‌ ్స అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రానికి గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును అందు కున్న దర్శకురాలు పాయల్‌ కపాడియాపై కేసులను ఎత్తేయాలని, ఆమెకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ప్రజానాట్యమండలి రౌండ్‌ టేబుల్‌ సమావే శంలో వక్తలు డిమాండ్‌ చేశారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అ నిల్‌ కుమార్‌ అధ్యక్షతన ఆదివారం పూలే-అంబేడ్కర్‌ భవన్‌లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశంల నిర్వహించారు. ఈ సమావేశంలో సాహితీ స్రవంతి రాష్ట్ర బాధ్యుడు వోరా ప్రసాద్‌ మాట్లాడారు. ప్రశ్నించే వారి పై కేసులు పెట్టడం, నిర్బంధాలకు గురిచేయడం బీజేపీ ప్రభుత్వ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. ఈ పదేళ్లలో కవులు, కళాకారులు, రచయితలపై దాడులు పెరిగాయన్నారు. కపాడియాకి స్కాలర్‌షిప్‌ ఆపేసినా, ఎఫ్టీఐఐ నుంచి సస్పెండ్‌ చేసినా ధైర్యం కోల్పోలేదన్నారు. దేశం గర్వించేలా కేన్స్‌ ఉత్స వాల్లో మొదటి భారతీయ మహిళా దర్శకురాలిగా బహుమతి పొందారన్నారు. కామ్రేడ్‌ జీఆర్కే-పోలవరపు సాంస్కృతిక వేదిక బాధ్యుడు గోళ్ల నారాయణ రావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్‌, జాషువా సాంస్కృతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణ, తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ కార్యదర్శి డీవీ రాజు, ఎంబీవీకే బాధ్యుడు యు.వి.రామరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వి. నర్సింహా రావు తదితరులు ప్రసంగించారు.

Updated Date - Jun 03 , 2024 | 03:28 AM