Share News

రైళ్ల రద్దు.. దారి మళ్లింపు..

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:36 PM

రైల్వే లైన్లకు విద్యుత పనుల వల్ల ఏర్పడనున్న ట్రాఫిక్‌ బ్లాక్‌ల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.

రైళ్ల రద్దు.. దారి మళ్లింపు..

గుంతకల్లు, జూన 12: రైల్వే లైన్లకు విద్యుత పనుల వల్ల ఏర్పడనున్న ట్రాఫిక్‌ బ్లాక్‌ల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నాందేడ్‌-బెంగళూరు నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 16594) రైలును జూలై 30, ఆగస్టు 6, 13 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. జూలై 2, 9 తేదీల్లో ఈ రైలును యలహంక-బెంగళూరు సెక్షనలో రద్దు చేసి, యలహంక-నాందేడ్‌ మధ్య నడపనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 16593)ను జూలై 2, 9, 30 తేదీల్లోనూ, ఆగస్టు 6, 13 తేదీల్లో దాదాపు గంటన్నర ఆలస్యంగా నడపనున్నట్లు వివరించారు. ముంబై- బెంగళూరు మధ్యన నడిచే ఉద్యాన ఎక్స్‌ప్రెస్‌ (నెం. 11301) రైలును జూలై 2, 9 తేదీల్లో గౌరీబిదనూరు నుంచి బయ్యపనహళ్లి, బెంగళూరు, హోసూరు మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు అరగంట ఆలస్యంగా నడపనున్నట్లు తెలిపారు. యశ్వంతపూర్‌-కోర్బా ఎక్స్‌ప్రెస్‌ (నెం.12251) రైలును ఈనెల 18న బాలార్షా, నాగపూర్‌, గోండియా స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 11:36 PM