Share News

బైపాస్‌ రహదారి అలైన్మెంట్‌ మార్పు చేయాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:04 AM

ఆదోని శివారు బైపాస్‌ రహదారి అలైన్మెంట్‌ మార్పు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని భూమి కోల్పోతున్న బాధితులు శ్రీనిధి, శ్రీనివాసులు, నాగరాజు, ఆనంద్‌ బాబు, పీ శ్రీనివాసులు అన్నారు.

బైపాస్‌ రహదారి అలైన్మెంట్‌ మార్పు చేయాలి

ఆదోని (అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 28: ఆదోని శివారు బైపాస్‌ రహదారి అలైన్మెంట్‌ మార్పు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని భూమి కోల్పోతున్న బాధితులు శ్రీనిధి, శ్రీనివాసులు, నాగరాజు, ఆనంద్‌ బాబు, పీ శ్రీనివాసులు అన్నారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైపాస్‌ రహదారి వల్ల భూమి కోల్పోతున్న బాధితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత బైపాస్‌ రహదారి అలైన్మెంట్‌, మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయకుండా కొత్త అలైన్మెంట్‌ సృష్టించి తమ భూములు లాక్కొని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైసా పైసా కూడ పెట్టుకుని ప్లాట్లు కొన్నామని ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మను కలసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Feb 29 , 2024 | 12:04 AM