Share News

అన్న క్యాంటీన్లను మూసి వైసీపీ పేదల కడుపుకొట్టింది: భువనేశ్వరి

ABN , Publish Date - Feb 07 , 2024 | 05:02 AM

అన్నదానం, మహాదానమని గుర్తించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో 368 అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు.

అన్న క్యాంటీన్లను మూసి వైసీపీ పేదల కడుపుకొట్టింది: భువనేశ్వరి

దుగ్గిరాల, ఫిబ్రవరి 6: అన్నదానం, మహాదానమని గుర్తించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో 368 అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులోని చెక్‌పోస్ట్‌ ఎదురుగా తెలుగు యువత నాయకుడు కాసరనేని జస్వంత్‌ ఆధ్వర్యంలో తెనాలి - విజయవాడ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ‘అన్న నందమూరి తారకరామారావు పేరిట ప్రారంభించిన ఈ క్యాంటీన్లలో నిత్యం 7.25 లక్షల మంది భోజనం చేసేవారు. ఇలాంటీ క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి రాగానే మూసివేసి పేదలు ఆకలి తీర్చుకునే అవకాశం లేకుండా చేసి వారి కడుపు కొట్టింది. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా టీడీపీ నాయకులు కుప్పం, మంగళగిరి తదితర ప్రాంతాల్లో 140 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. వాటిని కూడా అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఎదురొడ్డి పోరాడి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం’ అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, టీడీపీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 05:02 AM