Share News

రూ.600 కోట్లతో జైడస్‌ లైఫ్‌ షేర్ల బైబ్యాక్‌

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:30 AM

జైడస్‌ లైఫ్‌ సైన్సెస్‌.. రూ.600 కోట్లతో షేర్‌ బైబ్యాక్‌ను ప్రకటించింది. ఇందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

రూ.600 కోట్లతో జైడస్‌ లైఫ్‌ షేర్ల బైబ్యాక్‌

ముంబై: జైడస్‌ లైఫ్‌ సైన్సెస్‌.. రూ.600 కోట్లతో షేర్‌ బైబ్యాక్‌ను ప్రకటించింది. ఇందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 59.7 లక్షల షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. కంపెనీ మొత్తం పెయిడప్‌ క్యాపిటల్‌లో ఇది 0.59 శాతానికి సమానం. టెండర్‌ ఆఫర్‌ మార్గంలో ఈ షేర్లను కంపెనీ బైబ్యాక్‌ చేయనుంది. ఒక్కో షేరు ధరను రూ.1,005గా ఖరారు చేసింది. కాగా డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.4,505 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.790 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 27 శాతం వృద్ధి చెందింది.

Updated Date - Feb 10 , 2024 | 07:32 AM