Share News

రేపటి నుంచి రాజంపేట - పీలేరు మధ్య బస్సు

ABN , Publish Date - Aug 07 , 2024 | 11:24 PM

రాజంపేట-పీలేరు పట్టణాల మధ్య వయా సానిపాయ మీదుగా శుక్రవారం నుంచి బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు జనసేనపార్టీ పార్లమెంట్‌ నాయకుడు రామా శ్రీనివాసులు తెలిపారు.

రేపటి నుంచి రాజంపేట - పీలేరు మధ్య బస్సు

రాజంపేట, ఆగస్టు 7: రాజంపేట-పీలేరు పట్టణాల మధ్య వయా సానిపాయ మీదుగా శుక్రవారం నుంచి బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు జనసేనపార్టీ పార్లమెంట్‌ నాయకుడు రామా శ్రీనివాసులు తెలిపారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజంపేట డిపో మేనేజర్‌ రమణయ్య, పీలేరు డిపో మేనేజర్‌ బండ్లకుమార్‌ ఈ రెండు పట్టణాల మధ్య బస్సులు నడిపేందుకు అంగీకరించారన్నారు. 9న శుక్రవారం ఉదయం 5.30 గంటలకు పీలేరు నుంచి బస్సు రాజంపేటకు బయలుదేరుతుందన్నారు. 8.30 గంటలకు రాజంపేటకు చేరుకుని 9 గంటలకు రాజంపేట నుంచి తిరిగి పీలేరుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌సెల్‌ అధ్యక్షుడు కరుణాకర్‌రాజు, ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, గోపాల్‌, టీడీపీ లీగల్‌సెల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ, మహిళా పార్లమెంట్‌ ఉపాధ్యక్షురాలు వాణి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 11:24 PM