Share News

బుడమేరు లీకేజీ కట్టడి

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:52 AM

బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌(బీడీసీ) గండ్లను సమర్థంగా పూడ్చి న అధికారులకు ఇప్పుడు బండరాళ్ల నుంచి లీక్‌ అవుతున్న వరద నీటిని కట్టడి చేయడం పెద్ద సవాల్‌గా మారింది.

బుడమేరు లీకేజీ కట్టడి

వందల మందితో పనులు.. నేడు పూర్తయ్యే అవకాశం

మొదటి గండి వద్ద భారీగా నీరు లీక్‌

జియో మెంబ్రేన్‌ షీట్‌లతో కట్టడికి చర్యలు

జి.కొండూరు, సెప్టెంబరు 9: బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌(బీడీసీ) గండ్లను సమర్థంగా పూడ్చి న అధికారులకు ఇప్పుడు బండరాళ్ల నుంచి లీక్‌ అవుతున్న వరద నీటిని కట్టడి చేయడం పెద్ద సవాల్‌గా మారింది. వెలగలేరు హెడ్‌ రెగ్యులేట ర్‌ నుంచి బీడీసీకి 3.9, 4, 4.1 కిలోమీటర్ల వద్ద పడిన గండ్లను పూడ్చి కట్టను యథాతథ స్థితికి తీసుకురావడంతో పాటు బలోపేతం చేశారు. 4, 4.1 కి.మీ.ల వద్ద పడిన గండ్ల నుంచి నీరు పెద్దగా లీక్‌ కావడం లేదు కానీ 3.9కి.మీ.వద్ద పూడ్చిన అతిపెద్ద గండి వద్ద రాళ్ల సందుల్లో నుంచి నీరు భారీగా లీకవుతోంది. వరద ఉరవ డి ఇక్కడే అధికంగా ఉండటంతో లీకులు ఆగ డం లేదు. పైగా ఆది, సోమవారాల్లో వర్షం పడుతూనే ఉండటం ఆటంకంగా మారింది. మరోసారి వరద వస్తే కట్టకు గండిపడే ప్రమా దం ఉన్నందున సోమవారం ఉదయం నుంచి వందల మంది లీకులను యుద్ధ ప్రాతిపదికన సరిచేసే పనిలో ఉన్నారు. మంగళవారం నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

పనులు ఇలా...

రెస్క్యూ టీమ్‌లో ముగ్గురు వ్యక్తులు ఆక్సిజన్‌ సిలెండర్లు ధరించి నీళ్ల లోతుకు వెళ్లి లీకుల వ ద్ద పట్టను కప్పుతున్నారు. శాంతినగర్‌-కవులూ రు వంతెన వద్ద రైట్‌ బ్యాంక్‌పై సిద్ధంగా ఉంచి న ఇసుక బ్యాగ్‌లను 2 మర బోట్లలోకి గండ్ల వద్దకు తరలిస్తున్నారు. నీరు లీకవుతున్న కట్టపై లోపల పక్క జియో మెంబ్రేన్‌ షీట్‌లు(పట్టాలు) పరుస్తున్నారు. అవి కదలకుండా వాటిపై ఇసుక బస్తాలు ఉంచుతున్నారు. సుమారు 300 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పట్టలు పరడం పూర్తవగానే మట్టి పోసి లీకులను సరి చేయనున్నారు. మరోవైపు కట్టను పవర్‌ రోలర్‌తో బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడున్న కట్టకు సమాంతరంగా మరో బండ్‌ వేసి లీకులను కట్టడి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరో రోజులో లీకేజీలను సరిచేస్తామని ఎంఈఐఎల్‌ కెప్టెన్‌ రామ వెల్లడించారు.

బుడమేరు గండిని పూడ్చాం: ఆర్మీ

అల్వాల్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఏపీలోవరద సహాయ చర్యల్లో తమ జవాన్లు పాలుపంచుకున్నట్లు ఆర్మీ వెల్లడించింది. బుడమేరు గండిని విజయవంతంగా పూడ్చినట్లు తెలిపింది. ‘గేబియాన్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించాం. వెలుపలి వైపు మట్టితో 4 మీటర్ల ఎత్తు వరకు రక్షిత కట్టను నిర్మించడంతోపాటు ఇసుక సంచులతో నింపి కాలువకు పడిన గండిని పూడ్చడానికి ఆర్మీ బృందాలు తీవ్రంగా శ్రమించాయి(ఆ రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఆదేశాల మేరకు మరో 10 అడుగుల మేర కట్ట ఎత్తును పెంచేందుకు పౌర యంత్రాంగం కసరత్తు చేస్తోంది). దాంతో పాటు విజయవాడలో అజిత్‌సింగ్‌ నగర్‌, వైఎ్‌సఆర్‌ నగర్‌లలో ఆర్మీ వైద్యసహాయ బృందాలు పనిచేస్తున్నాయి. మా హ్యుమానిటేరియన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ బలగాలు డోర్నియ ర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌, మరో రెండు చేతక్‌ హెలికాప్టర్లలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాయి’ అని వెల్లడించింది.

ఆహారం అందలేదన్నందుకు.. బాధితుడి చెంప పగలగొట్టిన వీఆర్వో

విజయవాడ, సెప్టెంబరు 9: తమ వీధికి ఆహారం, మంచినీరు రాలేదని అడిగినందుకు విజయవాడలో వరద బాధితుడిపై వీఆర్వో చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. విజయవాడ 58వ డివిజన్‌ 259 సచివాలయం వీఆర్వో విజయలక్ష్మి.. పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది సమక్షంలో నే బాధితుడి చెంప చెళ్లుమనిపించారు. అసభ్యకరంగా దూషించి, బెదిరింపులకు దిగారు. ‘నన్నే ప్రశ్నిస్తారా’ అంటూ బాధితులపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వరద బాధితులకు సోమవారం రేషన్‌ పంపిణీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో స్థానికుడు ఒకరు తమ ప్రాంతానికి మంచి నీరు, ఆహారం అందలేదన్నారు. దీంతో వీఆర్వోకు, ఆయనకు మధ్య మాటామాటా పెరిగింది. సహనం కోల్పోయిన వీఆర్వో.. బాధితుడిని చెంపపై కొట్టారు. ఈ ఘటన పై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన సీరియ్‌సగా స్పందించారు. వీఆర్వోకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

Updated Date - Sep 10 , 2024 | 03:55 AM