గ్రంథాలయ నిర్మాణంతో బ్రౌన్ కీర్తి అజరామరం చేసిన జానమద్ది
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:27 AM
తెలుగు సూర్యుడుగా కీర్తి గడించిన సీపీ బ్రౌన్‌కు స్మారక చిహ్నంగా గ్రంథాలయాన్ని నిర్మించి బ్రౌన్ కీర్తిని అజరామరం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్ర్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు.
జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్
కడప (ఎర్రముక్కపల్లె), అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు సూర్యుడుగా కీర్తి గడించిన సీపీ బ్రౌన్‌కు స్మారక చిహ్నంగా గ్రంథాలయాన్ని నిర్మించి బ్రౌన్ కీర్తిని అజరామరం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్ర్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్త్రి శత జయంతి వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. తాను ఈ కార్యక్రమానికి రావడం హనుమచ్చాస్త్రి ఆశీర్వాదమేనని అన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు రాయలసీమ జన్మస్థానమని, అలాంటి గొప్ప వ్యక్తుల్లో హనుమచ్చాస్త్రి ఒకరని తెలిపారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ 2003లో కడప వచ్చినప్పుడు జానమద్దితో ఏర్పడిన పరిచయాన్ని తర్వాత అనుబంధంగా మారిన తీరును వివరించారు. అనంతరం జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, గుండ్లూరు దత్తాత్రేయశర్మ, సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ పార్వతి, అలపర్తి పిచ్చయ్యచౌదరి, డాక్టర్ గానుగపెంట హనుమంతరావు, ఇందిరా ప్రియదర్శిని, యలమర్తి మధుసూదనకు సాహితీ పురస్కారాలు అందించారు.