Share News

వివేకా కేసు డైరీని కోర్టు ముందుంచండి!

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:19 AM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

వివేకా కేసు డైరీని కోర్టు ముందుంచండి!

సీబీఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశం

అనినాశ్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ రద్దుపై

విచారణ ఏప్రిల్‌ 22 తర్వాతకు వాయిదా

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఏప్రిల్‌ 22తో ప్రారంభమయ్యే వారంలో నాన్‌ మిస్లేనియ స్‌డే నాడు విచారణ చేపడతామని పేర్కొంది. ఆలోగా హత్య కేసుకు సంబంధించి డైరీని డిజిటల్‌ రూపంలో తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఏప్రిల్‌ 22కన్నా ముందు ఈ కేసు విచారించే అవకాశం లేదని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా తెలిపారు. ఈ లోపు కేసు డైరీని తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించారు.

Updated Date - Feb 06 , 2024 | 04:19 AM