నెల్లూరులో రేపటి నుంచే రొట్టెల పండుగ
ABN , Publish Date - Jul 16 , 2024 | 03:38 AM
మత సామరాస్యనికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నెల్లూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మత సామరాస్యనికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడి బారాషహీద్ దర్గా ప్రాంగణంలో 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించనున్నా రు. దీనిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యం లో సర్కారు తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నుంచే గాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికా రులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుం డా దర్గా ప్రాంగణంతోపాటు నగరంలోనూ విస్తృత ఏర్పాట్లు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 70 మందితో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి నారాయణ పండుగ నిర్వహణపై సోమవారం సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.