Share News

ఇంజనీరింగ్‌లో అబ్బాయిలు అదుర్స్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:15 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌లో అబ్బాయిలు టాప్‌ ర్యాంకులు సాధించారు.

ఇంజనీరింగ్‌లో అబ్బాయిలు అదుర్స్‌

టాప్‌ టెన్‌ ర్యాంకులూ వారివే

సంఖ్యాపరంగా అమ్మాయిలే ఎక్కువ

అగ్రిలో తెలంగాణ విద్యార్థికి టాప్‌ ర్యాంక్‌

నాలుగు ర్యాంకులు కొట్టిన అమ్మాయిలు

ఈఏపీసెట్‌లో 78.26ు మందికి అర్హత

త్వరలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ

ఈసారి సీఎ్‌సఈలోనే లక్ష సీట్లు

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌లో అబ్బాయిలు టాప్‌ ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌ ర్యాంకులు అబ్బాయిలే కొల్లగొట్టారు. అగ్రికల్చర్‌ విభాగంలో మాత్రం తొలి 10 మందిలో ఆరుగురు అబ్బాయిలుంటే, నలుగురు అమ్మాయిలున్నారు. కాగా, ఇంజనీరింగ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం అమ్మాయులే ఉన్నారు. అగ్రికల్చర్‌లో స్వల్ప స్థాయిలో ఎక్కువ శాతం అబ్బాయిలు అర్హత సాధించారు. 3,39,140 మంది ఈఏపీసెట్‌ రాయగా వారిలో 2,65,444 మంది(78.26శాతం) అర్హత సాధించారు. ఈ మేరకు ఈఏపీసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు మంగళవారం విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 2,58,374 మంది పరీక్షలు రాయగా 1,95,092(75.51శాతం) మంది, అగ్రికల్చర్‌లో 80,766 మంది పరీక్షలు రాస్తే 70,352(87.11శాతం) అర్హత సాధించారు. ఈ పరీక్షల్లో ఈఏపీసెట్‌ పేపరుకు 75శాతం, ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇంజనీరింగ్‌లో అబ్బాయిలు 73.93శాతం, అమ్మాయిలు 77.65శాతం, అగ్రికల్చర్‌లో అబ్బాయిలు 87.98శాతం , అమ్మాయిలు 86.81శాతం మంది అర్హత సాధించారు. గతేడాది ఇంజనీరింగ్‌ విభాగంలో 76.32శాతం, అగ్రికల్చర్‌ లో 89.65శాతం మంది అర్హులయ్యారు.

ఇంజనీరింగ్‌ టాపర్లు

ఇంజనీరింగ్‌లో గుంటూరు జిల్లాకు చెందిన మాకినేని జిష్ణు సాయి టాప్‌ ర్యాంకు సాధించాడు. కర్నూలు జిల్లా విద్యార్థి ఎం.ఎ్‌స.యశ్వంత్‌ రెడ్డి ద్వితీయ ర్యాంకు, అదే జిల్లాకు చెంది భోగలపల్లి సందేశ్‌ తృతీయ ర్యాంకు సాధించారు. పాలగిరి సతీశ్‌రెడ్డి(అనంతపురం) నాలుగో ర్యాంకు, కోటమనేని మనీశ్‌చౌదరి(గుంటూరు) ఐదో ర్యాంకు, ఇ. లక్ష్మీ నరసింహారెడ్డి(సిద్ధిపేట, తెలంగాణ) ఆరో ర్యాంకు, గొల్ల లేఖ హర్ష(కర్నూలు) ఏడో ర్యాంకు, పుట్టి కుశాల్‌కుమార్‌(అనంతపురం) ఎనిమిదో ర్యాంకు, పి.సుశాంత్‌(హన్మకొండ, తెలంగాణ) తొమ్మిదో ర్యాంకు, కొమ్మిశెట్టి ప్రభా్‌స(ప్రకాశం) పదో ర్యాంకు సాధించారు.

అగ్రికల్చర్‌ టాపర్లు

అగ్రికల్చర్‌లో హైదరాబాద్‌కు చెందిన వై. శ్రీశాంత్‌ రెడ్డి 1వ ర్యాంకు, శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన పూల దివ్య తేజ ద్వితీయ ర్యాంకు, తిరుపతికి చెందిన వి.ముఖేశ్‌ చౌదరి తృతీయ ర్యాంకు, పేర సాత్విక్‌(చిత్తూరు) నాలుగో ర్యాంకు, ఆలూరు ప్రణీత(అన్నమయ్య) ఐదో ర్యాంకు, గట్టు భానుతేజ సాయి(అనంత) ఆరో ర్యాంకు, పి. నిహారికారెడ్డి(హైదరాబాద్‌) ఏడో ర్యాంకు, ఎస్‌. మనో అభిరామ్‌(విశాఖ) ఎనిమిదో ర్యాంకు, ఎస్‌. పావని(విశాఖ) తొమ్మిదో ర్యాంకు, ఎన్‌. రాధాకృష్ణ(పార్వతీపురం) పదో ర్యాంకు సాధించారు.

త్వరలోనే అడ్మిషన్లు

ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 24 వేల మంది అదనంగా అర్హత సాధించారని ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈసారి కంప్యూటర్‌ సైన్స్‌(సీఎ్‌సఈ) సీట్ల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉంది. గతేడాది ఇంజనీరింగ్‌ సీట్లు 1.6 లక్షలుంటే అందులో 75 వేల వరకు సీఎ్‌సఈ సీట్లే ఉన్నాయి. ఈ ఏడాది పరిమితి ఎత్తివేయడంతో కాలేజీలన్నీ సీఎ్‌సఈ సీట్లు భారీగా పెంచుకున్నాయి.

ముంబై ఐఐటీ తొలిప్రాధాన్యం

ఐఐటీలో చదవడమే తన లక్ష్యమని ఎం.జిష్ణుసాయి పేర్కొన్నారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్‌లో ఓపెన్‌ కేటగీరీలో 62వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌లో ముంబై ఐఐటీలో సీఎ్‌సఈ బ్రాంచ్‌కు మొదటి ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు జ్యోతి, కృష్ణమోహన్‌ల ప్రొత్సాహంతో ఇంతటి స్థాయిలో ర్యాంకు సాధించినట్లు వివరించారు. ఐసీఎ్‌సఈ సిలబ్‌సలో పది పూర్తిచేసినట్లు తెలిపారు. జేఈఈ మెయిన్స్‌లో 18వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 62వ ర్యాంకు సాధించానని, కాలేజీలో రోజువారీ, వీక్లీ టెస్టులు, అధ్యాపకులు ఇచ్చిన సూచనలు పాటించి, సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా మెరుగైన ర్యాంకు సాధించినట్లు వివరించారు.

- మొదటి ర్యాంకర్‌ జిష్ణుసాయి

ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సన్నద్ధం

ఒత్తిడి ఽఅధిగమించి పరీక్షలకు సన్నదం కావడం వల్లే ఏపీఈఏపీసెట్‌లో 2వర్యాంకు, జేఈఈ అడ్వాన్స్‌లో 50వ ర్యాంకు సాధించినట్లు ఎం సాయియశ్వంత్‌రెడ్డి వెల్లడించారు. ముంబై ఐఐటీలో సీఎ్‌సఈలో సీటు సాధనే లక్ష్యమని తెలిపారు. స్వస్థలం కర్నూలు, ఇక్కడ భాష్యంలో చదువుకున్నాను. తండ్రి రామేశ్వర్‌రెడ్డి స్కూల్‌ బ్యాగులు కుడతారు. తల్లి అరుణ గృహిణి. 6వ తరగతి నుంచి గుంటూరులోని జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాను. జేఈఈ మెయిన్స్‌లో 36వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 50వ ర్యాంకు సాధించాను. అయితే అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ ర్యాంకు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో హాజరయ్యాను. కాలేజీలో ఇచ్చిన ప్లానింగ్‌ ప్రకారం చదువుకుని, డైలీ, వీక్లీటెస్టులతో ముందుకు వెళ్లడం ద్వారా మంచి మార్కులు స్కోర్‌ చేయవచ్చని తెలిపారు.

- సాయియశ్వంత్‌రెడ్డి 2వ ర్యాంకు

Updated Date - Jun 12 , 2024 | 03:16 AM