Share News

నేడు, రేపు బోరుగడ్డ అనిల్‌ విచారణ

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:51 AM

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ సానుభూతిపరుడు, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ను పోలీసులు గుంటూరుకు తరలించారు.

నేడు, రేపు బోరుగడ్డ అనిల్‌ విచారణ

గుంటూరు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ సానుభూతిపరుడు, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ను పోలీసులు గుంటూరుకు తరలించారు. శనివారం మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికి చీకటి పడడంతో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు అనిల్‌ను విచారించనున్నట్టు సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు. 2019లో గుంటూరులోని ఏఈఎల్‌సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబు ప్రకాశ్‌ అనే వ్యక్తిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన నేరంపై అరండల్‌పేట పోలీస్‌ ేస్టషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో స్థానిక కోర్టు అనిల్‌కు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే, కేసు విచారణలో భాగంగా పోలీసులు కస్టడీకి అనుమతి కోరడంతో గుంటూరులోని ఐదవ అదనపు మున్సిఫ్‌ మేజిరేస్టట్‌ కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో బోరుగడ్డ అనిల్‌ను రాజమండ్రి నుంచి గుంటూరుకు తీసుకువచ్చారు.

Updated Date - Oct 27 , 2024 | 05:22 AM