Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పొడిగింపునకు బొప్పరాజు వినతి

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:11 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు సమర్పించేందుకు 30వ తేదీ వరకూ అవకాశం కల్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పొడిగింపునకు బొప్పరాజు వినతి

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు సమర్పించేందుకు 30వ తేదీ వరకూ అవకాశం కల్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. గురువారం అమరావతి సచివాలయంలో అడిషనల్‌ సీఈవో హరీంద్రప్రసాద్‌ను కలిసిన ఆయన ఫామ్‌ 12 సమర్పించడానికి గడువును 30వ తేదీ వరకూ పొడిగించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - Apr 26 , 2024 | 07:32 AM