Share News

పరకామణి దొంగలకు లోక్‌ అదాలత్‌లో రాజీనా!

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:08 AM

వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు హిందూ ఆలయాలను మింగేస్తే, సీఎంగా ఉన్న జగన్‌ రెడ్డి గుడిలో లింగాన్ని కూడా మిగల్చలేదని టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు.

పరకామణి దొంగలకు లోక్‌ అదాలత్‌లో రాజీనా!

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో 5న శంఖారావం: భానుప్రకాశ్‌ రెడ్డి

తెనాలి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు హిందూ ఆలయాలను మింగేస్తే, సీఎంగా ఉన్న జగన్‌ రెడ్డి గుడిలో లింగాన్ని కూడా మిగల్చలేదని టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘తిరుమల ఆలయంలో పరకామణి దొంగలను ఏ విచారణ లేకుండా కేవలం లోక్‌ అదాలత్‌లో రాజీ చేయటం దారుణం. రూ.100 కోట్లపైన దోచేశారు. వీటిపై పూర్తి విచారణ జరిగితేనే పాత్రధారులు, దోపిడీదారులు బయటకు వస్తారు. అందుకే దీనిపై స్పెషల్‌ ఎంక్వైరీ కోరాను. త్వరలో డీజీపీని కలసి నా దగ్గరున్న వివరాలను అందించి, విచారణ కోరతాను’ అని భానుప్రకాశ్‌ రెడ్డి అన్నారు. జనవరి 5న విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో శంఖారావం పూరించనున్నామని, హిందూ ధర్మ పరిరక్షణకోసం తీర్మానం చేయనున్నట్టు చెప్పారు.

Updated Date - Dec 28 , 2024 | 05:08 AM