Share News

Bhanu Prakash: అభినయ్, ధర్మారెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 10 , 2024 | 06:49 PM

తిరుపతిలో డూప్లికేట్, దొంగ ఓట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కే మీనాకు జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేత భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. దొంగ ఓట్లు నమోదు చేయించుకుని ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Bhanu Prakash: అభినయ్, ధర్మారెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు
Bhanu prakash Reddy

అమరావతి, ఏప్రిల్ 10: తిరుపతిలో డూప్లికేట్, దొంగ ఓట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కే మీనాకు జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేత భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. దొంగ ఓట్లు నమోదు చేయించుకుని ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. వైసీపీ చర్యలపై కూటమి తరఫున సిఇవోకు పిర్యాదు చేశామని తెలిపారు.

Nara Bhuvaneshwari : నిజం గెలవాలి ముగింపు సభకు చురుగ్గా ఏర్పాట్లు

అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్ధి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీనివాసులు తరపున ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆదిత్య అనే వ్యక్తి పేరు, అతడి తల్లిదండ్రుల పేర్లు ఉన్నవి రెండు మూడు బూత్‌ల్లో ఓట్లు ఉన్నాయని.. గత మూడు రోజులుగా ఇలాంటివి 6 వేల ఓట్లు వరకు గుర్తించామన్నారు. ఇటువంటివి 30 వేల ఓట్లు వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని తెలిపారు.

AP Elections: తణుకులో పంచ్ డైలాగ్స్‌తో అదరగొట్టిన చంద్రబాబు..

ఈ డూప్లికేషన్ ఓట్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు భాద్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి ఎం కే మీనాకు విజ్జప్తి చేశారు. అధికార జగన్ పార్టీ వై నాట్ 175 అని అనడానికి కారణం ఈ అక్రమాలేనని భావిస్తున్నామన్నారు. ఇలాగే ప్రతి నియోజకవర్గంలో డూప్లికేట్ ఓట్లు చేర్చారనే సందేహం కలుగుతుందని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం గరువారం ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఈ దొంగ ఓట్ల అవకతవకలలో అధికారులకు 20 శాతం భాద్యత ఉంటే రాజకీయ నాయకులకు 80 శాతం పాత్ర ఉందని ఆరోపించారు.


తిరుపతి ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్ధి శ్రీనివాసులు కుమారుడు శివకుమార్... గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లను బస్సుల్లో తీసుకు వచ్చి మరీ ఓట్లు వేయించారని భాను ప్రకాశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ క్రమంలోనే ఓ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా.. ఆరుగురు సిఐలు, ఒక ఎస్సైలను ఏం చేశారో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. గిరీష్ షా 35 వేల ఐడిలను ఆయన ఫింగర్ ప్రింట్ తో డూప్లికేట్ ఓట్లు చేశారని.. అయితే ఆ నాటి నుంచి నేటి వరకు అక్కడ ఒక్క ఓటు కూడా తొలగించలేదని చెప్పారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి ఈ దొంగ ఓట్లతో ఎమ్మెల్యే అవ్వాలని చూస్తున్నారన్నారు.

Lok Sabha Polls: తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేష్.. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా..

38,583 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని ఈ సందర్బంగా డియాండ్ చేశారు. టీటీడీ ఈవో ఎంవీ ధర్మారెడ్డి గత నాలుగున్నరేళ్లుగా తిరుమలలోనే విదులు నిర్వహిస్తున్నారని.. ఆయన్ని తక్షణం అక్కడి నుండి తోలగించాలన్నారు. అయితే వాలంటీర్లతో రిజైన్ చేయించి వారిని ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతల ఆగడాలపై మండిపడ్డారు. అయితే దొంగదారిన గెలుపోందాలనుకుంటే కుదరదని అధికార వైసీపీ నేతలకు ఈ సందర్భంగా భాను ప్రకాశ్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 10 , 2024 | 06:52 PM