Share News

బర్డ్‌ ఫ్లూ కోళ్ల వల్ల సోకదు..!

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:07 AM

‘‘బర్డ్‌ ఫ్లూ అనేది వైరస్‌ కాదు.. అంటురోగం అంతకంటే కాదు.. అది కోళ్ల వల్ల సోకదు’’ అని నేషనల్‌ ఎగ్‌ అండ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ కన్వీనర్‌ డాక్టర్‌

బర్డ్‌ ఫ్లూ కోళ్ల వల్ల సోకదు..!

నిరూపిస్తే కోటి రూపాయల నజరానా: నెక్‌

నెల్లూరు (సాంస్కృతికం), ఫిబ్రవరి 28: ‘‘బర్డ్‌ ఫ్లూ అనేది వైరస్‌ కాదు.. అంటురోగం అంతకంటే కాదు.. అది కోళ్ల వల్ల సోకదు’’ అని నేషనల్‌ ఎగ్‌ అండ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె.బాలస్వామి స్పష్టం చేశారు. నెల్లూరులోని జర్నలిస్టు భవన్‌లో కోళ్ల ఉత్పత్తిదారులు, విక్రయదారులు, వినియోగదారులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల పొదలకూరు, కోవూరు తదితర ప్రాంతాల్లో బ్రాయిలర్‌ కోళ్లకు బర్డ్‌ ఫ్లూ రావడం, జిల్లాలో చికెన్‌ దుకాణాలు మూసివేశారని తెలిసి నెల్లూరులో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో 2006 నుంచి బర్డ్‌ ఫ్లూ కోళ్లకు వస్తూ పోతూ ఉందని, ఏనాడైనా కోళ్ల నుంచి మనుషులకు ఆ వ్యాధి సోకి చనిపోయిన జాడలేదని అన్నారు. బర్డ్‌ ఫ్లూ ద్వారా మనిషి చనిపోయాడని రుజువు చేసిన వారికి నెక్‌ (నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ) రూ.కోటి బహుమతి ఇస్తుందని ప్రకటించారు. చికెన్‌, గుడ్డుతో బర్డ్‌ ఫ్లూ ప్రజలకురాదని తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 07:55 AM