Share News

జేఈఈ మెయిన్స్‌లో ‘భాష్యం’ ప్రభంజనం

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:17 AM

జేఈఈ మెయిన్‌-2024 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్‌ రామకృష్ణ వెల్లడించారు.

జేఈఈ మెయిన్స్‌లో ‘భాష్యం’ ప్రభంజనం

ఇద్దరు విద్యార్థులకు 100 పర్సంటైల్‌.. జాతీయస్థాయిలో 18, 36 ర్యాంకులు

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 25: జేఈఈ మెయిన్‌-2024 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్‌ రామకృష్ణ వెల్లడించారు. గుంటూరులోని భాష్యం మెయిన్‌ క్యాంప్‌సలో గురువారం ఆయన వివరాలు తెలిపారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలో భాష్యం విద్యార్థి ఎం.జిష్ణుసాయి ఆలిండియా టాప్‌ మార్కు 300కి 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్‌తో ఓపెన్‌ కేటగీరీలో ఆలిండియా 18వ ర్యాంకును సాధించారన్నారు. ఎం.సాయియశ్వంత్‌రెడ్డి 100 పర్సంటైల్‌తో ఓపెన్‌ కేటగీరీలో ఆలిండియా 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో ఆలిండియా 4వ ర్యాంకు కైవసం చేసుకున్నారన్నారు. ఆలిండియా స్థాయిలో డి.భరత్‌చంద్ర 20వ ర్యాంకు, కె.జె.వివేక్‌ 33, జి.జాన్‌ 49, కె.హర్షిత 50, పి.శ్యామ్‌ 62, జె.మణిప్రదీప్‌ 69, కె.చైతన్య 77, ఎ.గణేషదత్తా 78, కె.శ్రేయ 82 ర్యాంకులు సాధించారన్నారు. 100 లోపు అత్యుత్తమ ర్యాంకులతో పాటు జాతీయ స్థాయిలో 200 లోపు 25 ర్యాంకులు, 500 లోపు 54 ర్యాంకులు, 1000 లోపు 78 ర్యాంకులు కైౖవసం చేసుకొని 71.68 శాతం ఫలితాలతో భాష్యం విద్యార్థులు సత్తా చాటారన్నారు. ర్యాంకర్లను భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్‌ హనుమంతరావు, భాష్యం ఐఐటి జేఈఈ కోఆర్డినేటర్‌ ఆనంద్‌ తదితరులు అభినందించారు.

Updated Date - Apr 26 , 2024 | 04:17 AM