ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారతిరెడ్డి
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:12 AM
‘ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారతిరెడ్డి పాత్ర ఉంది. త్వరలోనే ఆమె ప్రమేయం కూడా బయటకు వస్తుంది. రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు’ అని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు.

భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు
భారతి రాజ్యాంగాన్ని అమలు చేశారు: ఆదినారాయణరెడ్డి
అరాచకాల ఫలితమే ప్రజా తీర్పు: సత్యకుమార్
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ‘ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారతిరెడ్డి పాత్ర ఉంది. త్వరలోనే ఆమె ప్రమేయం కూడా బయటకు వస్తుంది. రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు’ అని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మొదటిసారి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలు సత్యకుమార్ (ధర్మవరం), పార్థసారథి(ఆదోని)తో కలసి ఆదినారాయణరెడ్డి వచ్చారు. వారికి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భగా జమ్మలమడుగు ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అన్ని వ్యవస్థల్నీ నాశనం చేసిందని.. వైసీపీ నాయకులందరూ బీజేపీకి క్యూ కడుతున్నారని అన్నారు. సత్యకుమార్ మాట్లాడుతూ, ‘అభివృద్ధిని వదిలేసి ఉత్తుత్తి బటన్ నొక్కిన జగన్‌రెడ్డికి అదే బటన్‌తో ప్రజలు బుద్ధి చెప్పారు. అరాచకాలపై వచ్చిన తీర్పును విశ్లేషించుకోకుండా ఈవీఎంలపై నిందలేయడం దొంగలు పోలీసుల్ని నిందించినట్లుంది’ అన్నారు.