Share News

పోరుబాటలో భారతి సిమెంట్స్‌ కార్మికులు

ABN , Publish Date - May 31 , 2024 | 03:34 AM

సీఎం జగన్‌కు చెందిన భారతి సిమెంటు ఫ్యాక్టరీలో కార్మికులు పోరుబాట పట్టారు. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లె వద్ద ఉన్న భారతి సిమెంటు పరిశ్రమలో పనిచేస్తున్న పర్మినెంటు ఉద్యోగులు గురువారం ఉదయం నుంచీ పరిశ్రమ ప్రధాన గేట్లు మూసి నిరసన వ్యక్తం చేశారు.

పోరుబాటలో భారతి సిమెంట్స్‌ కార్మికులు

విలువైన భూములిచ్చాం... అయినా మాపై వివక్షే

నిర్వాసిత ఉద్యోగుల ఆవేదన...

పెంపుపై హామీ ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం

కడప (ఎన్టీఆర్‌ సర్కిల్‌), మే 30: సీఎం జగన్‌కు చెందిన భారతి సిమెంటు ఫ్యాక్టరీలో కార్మికులు పోరుబాట పట్టారు. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లె వద్ద ఉన్న భారతి సిమెంటు పరిశ్రమలో పనిచేస్తున్న పర్మినెంటు ఉద్యోగులు గురువారం ఉదయం నుంచీ పరిశ్రమ ప్రధాన గేట్లు మూసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ‘ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో రాజకీయ నేతల మాటలు విని మూడు పంటలు పండే విలువైన భూమిని ఇచ్చాం. ఇప్పుడే అదే ఫ్యాక్టరీలో చాలీచాలని జీతాలకు పనిచేస్తున్నాం. వేతనాల్లో, ఇంక్రిమెంట్లలో అన్యాయం జరుగుతోంది. యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే ఆందోళన విరమిస్తాం. మా సమస్య పరిష్కారం కాకపోతే జేఏసీగా ఏర్పడి ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. ఆందోళనలో నల్లింగాయపల్లె, అగస్త్యలింగాయపల్లె, పందిళ్లపల్లె, చదిపిరాళ్ల గ్రామాలకి చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సిమెంటు పరిశ్రమ వద్దకు చేరుకుని కార్మికులతో చర్చించారు.

Updated Date - May 31 , 2024 | 03:34 AM