జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు భానుతేజ
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:09 PM
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో పదో తరగతి విద్యార్థి భానుతేజ ఎంపికయ్యాడు.

కదిరి అర్బన, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో పదో తరగతి విద్యార్థి భానుతేజ ఎంపికయ్యాడు. ఈనెల 21 నుంచి 23 వరకు అండర్ 17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన ఆధ్వర్యంలో హిందూపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో భానుతేజ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. నవంబరు ఆరు నుంచి ఉత్తర్ ప్రదేశలో నిర్వహించే జాతీయస్థాయ క్రీడాపోటీల్లో పాల్గొంటారు. అతన్ని ఆ పాఠశాల కరస్పాండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి, పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయులు, పీఈటీ శుక్రవారం అభినందించారు.