Share News

ప్రచారంలో దూసుకుపోతున్న బీవీ

ABN , Publish Date - May 03 , 2024 | 12:34 AM

ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న బీవీ
బీవీ జ‌య‌నాగేశ్వ‌ర‌రెడ్డికి మ‌ద్ద‌తు తెలుపుతున్న మైనార్టీ మ‌హిళ‌లు

ఎమ్మిగనూరు, మే2: ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో విస్తృత ప్రచారంతో పాటు పట్టణంలో ఆయా వార్డుల్లో జనాన్ని కలుస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. నియోజకవర్గంలో గ్రామ గ్రామాల్లో టీడీపీ ప్రచారం మారుమోగుతోంది. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక గ్రామాల్లో ప్రచార రథంపై ఊరేగుతూ ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ అభ్యర్థి బీవీ మాత్రం గ్రామాల్లోను, పట్టణంలోను ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. అలాగే వీధుల్లో మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహాన కల్పిస్తున్నారు.

మైనార్టీ కాలనీ మహిళల మద్దతు

పట్టణంలోని ముస్లీం మైనార్టీ కాలనీకి చెందిన పలువురు మహిళలు బీవీ స్వగృహానికి తరలివచ్చి బీవీ జయనాగేశ్వర రెడ్డిని కలిసి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి దివంగత బీవీ మోహాన్‌ రెడ్డి ఉన్న సమయంలో మైనార్టీకాలనీ ఏర్పాటైందని, దాని అభివృద్ధికి మీరందించిన సహకారానికి అండగా నిలవాలని తరలివచ్చినట్లు పేర్కొన్నారు.

మాచాని సోంనాథ్‌ విస్తృత ప్రచారం : టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి గెలుపుకోసం టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మాచాని సోంనాథ్‌ పట్టణంలోని మూడోవార్డులో వార్డు ఇన్‌చార్జీ చేనేత మల్లి ఆద్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట టీడీపీ చేనేత విభాగం నాయకులు మిన్నప్ప, కామర్తి మహెష్‌ పాల్గొన్నారు.

టీడీపీ విస్తృత ప్రచారం : నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ గ్రామనాయకులు, మండల నాయకులు, వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఇన్‌చార్జీలు, తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌నాయకులు ఇంటింటికి బీవీ గెలుపుకోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కె. తిమ్మాపురం గ్రామంలో కురువ సంఘం టీడీ పీ జిల్లా సాధికార కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. గోనెగండ్ల మండలం పుట్టపాశం, అయ్యకొండ, గంజహళ్లి, అగ్రహరం, బైలుప్పల గ్రామాల్లో బీవీ విస్తృత ప్రచారం నిర్వహించారు.

నందవరం నాయకులతో బీవీ సమాలోచనలు : ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా మండలాల నాయకులతో బీవీ జయనాగేశ్వరరెడ్డి సమావేశమైయ్యారు. నందవరం మండల నాయకులు ముగతి ఈరన్న గౌడ్‌, మాదవరావు దేశాయ్‌, రుఘుమూర్తి స్వామి, పార్థసారథి రెడ్డి, రైస్‌మిల్‌ నారాయణరెడ్డి, భార్గవ్‌లతో పాటు ఆయా గ్రామాల నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెల్లాలో దిశానిర్దేశం చేశారు.

పెసన్నదిన్నే వైసీపీ నాయకుల చేరిక : ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నే గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు 20కుటుంబాలు గురువారం మాజీ ఎమ్మెల్యే బీవీ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సైకో ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు.

Updated Date - May 03 , 2024 | 12:34 AM