Share News

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:51 AM

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, స్టాటిస్టిక్స్‌ సర్వేలెన్స్‌ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్‌ బడాదియా (ఐఆర్‌ఎస్‌) అన్నారు.

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్‌ బడాదియ

ఆదోని, ఏప్రిల్‌ 19: ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, స్టాటిస్టిక్స్‌ సర్వేలెన్స్‌ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్‌ బడాదియా (ఐఆర్‌ఎస్‌) అన్నారు. శుక్రవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆదోని సబ్‌ కలెక్టర్‌, ఎన్నికల అధికారి శివ్‌నారాయణ్‌ శర్మతో కలిసి వ్యయ పరిశీలకుల బృందం, వీడియో సర్వేలెన్స్‌ బృందం, వీడియో వీవింగ్‌ బృందం, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిస్టిక్స్‌ బృందాలకు, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిస్టిక్స్‌ బృందాల విధులు, బాధ్యతలు, ఫిర్యాదుల పై తక్షణమే స్పందించడం, నిరంతరం తనిఖీ నిర్వాహణ, ఈఎస్‌ఎంఎస్‌ అప్లికేషన్‌, సీ-విజిల్‌ యాప్‌ తదితర అంశాల పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి అప్పమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలలో విధిగా పాటించాలని, అన్ని పార్టీల అభ్యర్థుల పట్ల నిబందనలకు అనుగుణంగా సమదృష్టితో వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం ఢనాపురం చెక్‌పోస్టు దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్‌ సర్వేలెన్స్‌ నిర్వహిస్తున్న విఽధులను ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్‌ బడాదియా, సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ అకస్మికంగా తనిఖీ చేశారు.

Updated Date - Apr 20 , 2024 | 12:51 AM