త్యాగానికి ప్రతీక బక్రీద్
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:30 AM
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ముస్లింలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకున్నారు.
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ముస్లింలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకున్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవులలో త్యాగనిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ సారాంశమని మత పెద్దలు తెలిపారు. అన్ని గుణాలలో దాణగుణమే ఉత్తమమైనదని హజ్రత్ ఇబ్రహీం నిరూపించారని, సకల మానవాళికి హజ్రత్ ఇబ్రహీం దానగుణం అనుసరనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పేదలకు దానధర్మాలు చేశారు.
- ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్