Share News

జోగి కుమారుడికి బెయిల్‌

ABN , Publish Date - Aug 24 , 2024 | 05:10 AM

సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

జోగి కుమారుడికి బెయిల్‌

విజయవాడ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయాధికారి హిమబిందు శుక్రవారం తీర్పును వెలువరించారు. ఈనెల 13వ తేదీన ఏసీబీ అధికారులు రాజీవ్‌తోపాటు విజయవాడ రూరల్‌ మండలం సర్వేయర్‌ రమే్‌షను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ప్రతి రెండో శనివారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని, విదేశాలకు వెళ్లేటప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాలని, నివాస చిరునామాలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు అందజేయాలని షరతులు విధిస్తూ రాజీవ్‌, రమే్‌షలకు బెయిల్‌ మంజూరు చేశారు.

================

Updated Date - Aug 24 , 2024 | 07:35 AM