రూ.34లక్షలతో బాహుదా ప్రాజెక్టు అభివృద్ధి పనులు
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:50 PM
మండలంలోని ముష్టూరు పంచాయతిలో గల బాహుదా ప్రా జెక్టులో రూ.34లక్షలతో పలు అభి వృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే షాజహనబాషా పేర్కొన్నారు.

నిమ్మనపల్లి, డిసెంబరు 22(ఆంధ్ర జ్యోతి): మండలంలోని ముష్టూరు పంచాయతిలో గల బాహుదా ప్రా జెక్టులో రూ.34లక్షలతో పలు అభి వృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే షాజహనబాషా పేర్కొన్నారు. ఆదివారం ఆమేరకు ఆయన బాహుదా ప్రాజక్టు వద్దకు చేరుకొని స్టేట్ డిసోడిన మెయింటి నెన్స ఫండ్ (ఎస్‌డిఎమ్‌ఎఫ్) ద్వారా మంజూరైన పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ బాహుదాకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని కనీసం గేట్లకు గ్రీసు కూడా వేయించలేదన్నారు. కూటమి ప్రభు త్వం అధికాలోకి రాగానే రైతుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఎస్‌డీఎమ్‌ఎఫ్ ఫండ్ కింద నిధుల మంజూరు చేసి బాహుదాకు కావలసిన జనరేటర్ రూము నిర్మాణంతో పాటు కొత్త జనరేటర్ ఏర్పాటు, జంగల్ క్లియరెన్స, తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు తవళం పంచాయతిలో ఎగువపల్లిలోని అనారోగ్యంలో బాధపడుతున్న సహదేవరెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్‌ను అందజేశారు. కార్యక్రమంలో వెంగంవారిపల్లి వైసీపీ సర్పంచ శ్రీవాణి టీడీపీలో చేరగా ఎమ్మెల్యే షాజహానబాషా పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇరిగేషన ఈఈ సురేష్‌బాబు, డీఈ కేడీఆర్ ప్రసాద్, బాహుదా ఏఈ శ్రీహరిరెడ్డి, మదనపల్లి ఏఈ ప్రసాద్, సాగునీటి సంఘం అఽధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచ రెడ్డెప్ప, ఆర్జే వెంకటేష్, రాజన్న, లక్ష్మన్న, శ్రీపతి, జయన్న, రాజా, బాస్కర్‌రెడ్డి, రమణ పాల్గొన్నారు.