Share News

బాబు అక్రమ అరెస్టుతోనే వైసీపీ పతనానికి నాంది: మంత్రి ఫరూక్‌

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:13 AM

చంద్రబాబు అక్రమ అరెస్టుతోనే వైసీపీ పతనానికి నాంది పడిందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

బాబు అక్రమ అరెస్టుతోనే వైసీపీ పతనానికి నాంది: మంత్రి ఫరూక్‌

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు అక్రమ అరెస్టుతోనే వైసీపీ పతనానికి నాంది పడిందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా మచ్చలేని ప్రజా నాయకుడు చంద్రబాబు. అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆయనపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేసిన సైకో జగన్‌ ప్రభుత్వం... టెర్రరిస్టు పాలనను తలపింపచేసింది. ప్రజలందరూ తిరుగులేని విధంగా ఓటుతో బుద్ధి చెప్పారు’ అని ఫరూక్‌ అన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 07:01 AM