Share News

నత్తనడకన ‘ఆయుష్మాన్‌ భారత్‌’

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:25 AM

పేదల ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం రాష్ట్రంలో బాలారిష్టాలు ఎదుర్కొంటోంది.

నత్తనడకన ‘ఆయుష్మాన్‌ భారత్‌’

రాష్ట్రంలో ఐదు శాతం కూడా పంపిణీ కాని పథకం కార్డులు

ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిన నాటి వైసీపీ సర్కార్‌

కూటమి సర్కార్‌ దృష్టి సారిస్తే 60 లక్షల కుటుంబాలకు మేలు

గుంటూరు (మెడికల్‌)

పేదల ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం రాష్ట్రంలో బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఆరేళ్ల కిందట కేంద్ర ంలోని ఎన్‌డీఏ సర్కార్‌ ‘భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ (పీఎంజేఏవై) పేరిట ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో లబ్ధిదారులకు ఏడాదిలో రూ.5 లక్షల విలువైన వైద్యసేవలు ఉచితంగా లభిస్తాయి. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో పేద రోగులు ఉచితంగా వైద్యసేవలను పొందవచ్చు. చికిత్సకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. పఽథకంను ప్రారంభించి ఆరేళ్లు అయినప్పటికీ రాష్ట్రంలో ఐదు శాతం లబ్ధిదారులకు కూడా ఇంకా ఐడీ కార్డులను అందజేయలేదు.

ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్న జగన్‌ సర్కార్‌..

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పఽథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా నాటి వైసీపీ సర్కార్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కు, రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందనే భయంతోనే నాటి జగన్‌ సర్కార్‌ వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలుకు మాత్రమే ప్రాధాన ్యం ఇచ్చి ఆయుష్మాన్‌ భారత్‌ను తొక్కిపట్టినట్లు విమర్శలు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక కేంద్రమే పూర్తి చేసి డేటాను రాష్ట్రానికి పంపినా, సచివాలయ వలంటీర్లతో ఈకేవైసీ చేయించి కార్డులు అందజేయాల్సిన జగన్‌ సర్కార్‌ ఆ పని జరగకుండా అడ్డుపడింది. ఆయుష్మాన్‌ భారత్‌ పఽథకంలో లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించేందుకు వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీని వలంటీర్లకే ఇచ్చారు. జగన్‌ సర్కార్‌ నుంచి మౌఖికంగా అందిన ఆదేశాలతో వలంటీర్లు ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించారు. ఫలితంగా లబ్ధిదారుల్లో అత్యధిక మందికి నేటికీ కార్డులు అందక విలువైన వైద్యసేవలు కోల్పోతున్నారు.

ఈకేవైసీ 81 శాతం పూర్తయినా..

తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం...రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకం కింద 61.67 లక్షల కుటుంబాలు, 1.95కోట్ల మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇప్పటికీ వీరిలో 1,56,78,383 మందికి ఈకేవైసీ అప్‌డేట్‌ చేశారు. నిర్దేశించిన లక్ష్యంలో ఇది 80.64 శాతం. మరో 37,64,485 మంది లబ్ధిదారుల ఈకేవైసీ(19.36 శాతం) మాత్రమే చేయించాల్సి ఉంది. ఏలూరు జిల్లా(102.65 శాతం), వైఎ్‌సఆర్‌ జిల్లా (101.82 శాతం), శ్రీకాకుళం(99.50 శాతం), తూర్పు గోదావరి (95.07 శాతం), పొట్టిశ్రీరాములు నెల్లూరు(93.41 శాతం), అనంతపురం(91.77 శాతం), తిరుపతి(91.72 శాతం) ఈకేవైసీ పూర్తి చేసినట్లు ప్రకటించారు. మిగిలిన జిల్లాలు కూడా సగటున 80 శాతం వరకు పూర్తిచేసినట్లు తెలిపారు. అయితే, లబ్ధిదారులకు ఐడీకార్డుల పంపిణీలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.

గుంటూరు జిల్లాలో 400 కార్డులే పంపిణీ..

రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో 28,176 మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు మంజూరవగా, లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 4,234 కార్డులను మాత్రమే జారీ చేశారు. ఇందులోనూ కనీసం 400 కార్డులు కూడా పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. పెదకాకానిలో 1,368 కార్డులకుగాను కేవలం 13, తాడేపల్లిలో 648 కార్డులకు 12, గుంటూరు రూరల్‌లో 648 కార్డులకు 19, కాకుమానులో 936 కార్డులకు 33, దుగ్గిరాలలో 1,224 కార్డులకు 46, మంగళగిరిలో 1,512 కార్డులకు 67, పొన్నూరు లో 1,440 కార్డులకు 59 మాత్రమే లబ్ధిదారులకు అందజేసినట్లు అధికారికంగా ప్రకటించినా, క్షేత్రస్థాయిలో అవి కూడా సమక్రమంగా అందలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్ర భుత్వం అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సత్యకుమార్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నందున ఈ విషయంపై దృష్టి సారిస్తే లక్షలాది నిరుపేద కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - Aug 27 , 2024 | 04:26 AM