జేకే భారవికి వేటూరి కవితా పురస్కారం ప్రదానం
ABN , Publish Date - Jan 30 , 2024 | 02:36 AM
వేటూరి సాహితీపీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తునిలోని చిట్టూరి మెట్రోలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వేటూరి కవితా పురస్కారాన్ని సినీ రచయిత జేకే భారవికి ప్రదానం చేశారు.
తుని రూరల్, జనవరి 29: వేటూరి సాహితీపీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తునిలోని చిట్టూరి మెట్రోలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వేటూరి కవితా పురస్కారాన్ని సినీ రచయిత జేకే భారవికి ప్రదానం చేశారు. భారవి మాట్లాడుతూ వేటూరివారి పురస్కారాన్ని అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కేఆర్‌జే శర్మ, ప్రధాన కార్యదర్శి విజయ్‌ప్రకా్‌షల కృషి అభినందనీయమని వక్తలు కొనియాడారు.