Share News

జగన్‌తో అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జి భేటీ

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:52 AM

కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి తనను ఇన్‌చార్జిగా ప్రకటించినప్పటి నుంచి అందుబాటులో లేకుండా పోయిన సింహాద్రి చంద్రశేఖరరావు సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు.

జగన్‌తో అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జి భేటీ

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి తనను ఇన్‌చార్జిగా ప్రకటించినప్పటి నుంచి అందుబాటులో లేకుండా పోయిన సింహాద్రి చంద్రశేఖరరావు సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఆయన వెంట కుమారుడు రామ్‌చరణ్‌ ఉన్నారు. కాగా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వచ్చి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారి ధనుంజయరెడ్డితో సమావేశమయ్యారు. పరుచూరు సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌, అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కోడుమూరు (ఎస్సీ) ఇన్‌చార్జి ఆదిమూలపు సతీశ్‌, సిటింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌, ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా సీఎంవోకు వచ్చారు.

Updated Date - Feb 06 , 2024 | 03:52 AM