అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
ABN , Publish Date - Mar 19 , 2024 | 03:15 AM
‘ఏపీలో మే 13న సీఎం జగన్ పీడ విరగడవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌తో పాటు ఆయనను నమ్ముకున్న కొంతమంది అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం’ అని నరసాపురం
సీబీఐ చార్జ్‌షీట్ ఆధారంగా వివేకా బయోపిక్: రఘురామరాజు
న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో మే 13న సీఎం జగన్ పీడ విరగడవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌తో పాటు ఆయనను నమ్ముకున్న కొంతమంది అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం’ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చిలకలూరిపేటలో టీడీపీ కూటమి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. సభకు జనం లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. జగన్ తరహాలో సారా, డబ్బులు పంపిణీ చేయలేదు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేసి, మనల్ని మనం కాపాడుకోవాలన్న కసి ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. సీబీఐ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాల ఆధారంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్‌ను రూపొందించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా దాని టీజర్‌ను విడుదల చేశారు. ఈ నెల 22న యూట్యూబ్ మాధ్యమంలో ఆ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ చిత్రం ద్వారా ప్రజలకు కొన్ని నమ్మలేని నిజాలు, సాక్షి రాతలు అబద్ధాలని తెలిసే అవకాశం ఉంది’ అని అన్నారు.