ఆర్యవైశ్యులు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి: ముక్కాల
ABN , Publish Date - Jan 29 , 2024 | 02:15 AM
ఇంతకాలం గుప్తదానాలతో సమాజానికి ఉపయోగపడిన ఆర్యవైశ్యులంతా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 28: ఇంతకాలం గుప్తదానాలతో సమాజానికి ఉపయోగపడిన ఆర్యవైశ్యులంతా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్ధితులు మారిన దృష్ట్యా ఇంత కాలం ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని స్పష్టంచేశారు.