Share News

విశాఖ పోర్టుకు భారీ నౌక రాక

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:37 AM

విశాఖపట్నం పోర్టుకు గురువారం 1,99,900 టన్నుల మాంగనీస్‌తో భారీ నౌక ‘ఎంవీ హహైన్‌’ వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో సరకు ఒకే నౌక ద్వారా భారతీయ పోర్టుకు రావడం ఇదే ప్రథమమని పోర్టు వర్గాలు తెలిపాయి. మాంగనీస్‌ ఎగుమతికి పేరొందిన ఎరామెట్‌ ఎస్‌.ఎ.ఫ్రాన్స్‌ దీనిని గబాన్‌ నుంచి ఇక్కడకు పంపించింది. జనరల్‌ కార్గో బెర్తులో ఈ నౌకను నిలిపి బోత్రా

విశాఖ పోర్టుకు భారీ నౌక రాక

విశాఖపట్నం, జూలై 25(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టుకు గురువారం 1,99,900 టన్నుల మాంగనీస్‌తో భారీ నౌక ‘ఎంవీ హహైన్‌’ వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో సరకు ఒకే నౌక ద్వారా భారతీయ పోర్టుకు రావడం ఇదే ప్రథమమని పోర్టు వర్గాలు తెలిపాయి. మాంగనీస్‌ ఎగుమతికి పేరొందిన ఎరామెట్‌ ఎస్‌.ఎ.ఫ్రాన్స్‌ దీనిని గబాన్‌ నుంచి ఇక్కడకు పంపించింది. జనరల్‌ కార్గో బెర్తులో ఈ నౌకను నిలిపి బోత్రా షిప్పింగ్‌ సర్వీసెస్‌ సంస్థ 1,24,500 టన్నుల మాంగనీస్‌ను అన్‌లోడింగ్‌ చేసింది. ఈ నౌక పొడవు 300 మీటర్లు, వెడల్పు 50 మీటర్లు కాగా డ్రాఫ్ట్‌ 18.46 మీటర్లుగా పోర్టు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్‌ అంగముత్తు మాట్లాడుతూ విశాఖ పోర్టును బల్క్‌ కార్గో ట్రాన్షిప్‌మెంట్‌ హబ్‌గా మార్చడానికి యత్నిస్తున్నామన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 07:02 AM