అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడి అరెస్టు
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:18 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, గుంటూరుకు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ షేక్ రబ్బాని (ఏ-51)ని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు
బాబు నివాసంపై దాడి ఘటనలో జోగి రమేశ్ అనుచరులు ఇద్దరు అదుపులోకి
మంగళగిరి సిటీ/తాడేపల్లి, సెప్టెంబరు 9: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, గుంటూరుకు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ షేక్ రబ్బాని (ఏ-51)ని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరు పరిచినట్టు రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 25 మందిని అరెస్టు చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రధాన అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కుంచం జయరాజు (ఏ-23), వెంకట కోటేశ్వరరావు (ఏ-13)ను అదుపులోకి తీసుకున్నట్టు తాడేపల్లి సీఐ బి.కల్యాణరాజు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిందని చెప్పారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు.