Share News

ఏపీఆర్‌సెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 23 , 2024 | 03:17 AM

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశానికి చేపట్టిన ఏపీఆర్‌సెట్‌ (ఏపీ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) 2023-24 ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీఆర్‌సెట్‌ ఫలితాలు విడుదల

జూన్‌ 10 తర్వాత అడ్మిషన్లు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 22: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశానికి చేపట్టిన ఏపీఆర్‌సెట్‌ (ఏపీ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) 2023-24 ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్వీయూ వీసీ శ్రీకాంత్‌ రెడ్డి, ఏపీ ఆర్‌సెట్‌ కన్వీనర్‌ దేవప్రసాదరాజు తిరుపతిలో ఈ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 64 సబ్జెక్టులకు 10,050 మంది దరఖాస్తు చేసుకున్నారని, 8,651 మంది పరీక్షలు రాశారని చెప్పారు. ఇందులో 4,352 మంది ఉత్తీర్ణత సాధించగా, 50.3 శాతం ఉత్తీర్ణత నమోదైందని వివరించారు. ఫలితాల కోసం.. జ్ట్టిఞట://ఛ్ఛ్టిట.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ/ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. జూన్‌ 10వ తేదీ తర్వాత పీహెచ్‌డీలో ప్రవేశానికి అడ్మిషన్లు చేపడతామని తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 08:05 AM