Share News

కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:12 AM

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఈ నెల 12 నుంచి స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని.

కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు

అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఈ నెల 12 నుంచి స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని.. 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జ్ట్టిఞట://్చఞజుజఛఠ్చి. ్చఞఛిజటట.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు.

Updated Date - Mar 09 , 2024 | 07:46 AM