Share News

ఆ అవినీతి ఒప్పందంపై దర్యాప్తు జరపాలిఆ అవినీతి ఒప్పందంపై దర్యాప్తు జరపాలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:30 AM

వివాదాస్పద పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మధ్య అవినీతి ఒప్పందంపై దర్యాప్తునకు ఆదేశించాలని ఏపీసీసీ

ఆ అవినీతి ఒప్పందంపై దర్యాప్తు జరపాలిఆ అవినీతి ఒప్పందంపై దర్యాప్తు జరపాలి

గవర్నర్‌ను కోరిన షర్మిల

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మధ్య అవినీతి ఒప్పందంపై దర్యాప్తునకు ఆదేశించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ను అభ్యర్థించారు. రాజ్‌భవన్‌లో బుధవారం ఆమె గవర్నర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అదానీ, జగన్‌ మధ్య ముడుపుల బంధం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టమని, వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 06:30 AM