Share News

జవహర్ రెడ్డిపై వేటుకు రంగం సిద్దం..!

ABN , Publish Date - Apr 10 , 2024 | 08:39 PM

ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాంటి వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహార్ రెడ్డిపై వేటు వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జవహర్ రెడ్డిపై వేటుకు రంగం సిద్దం..!
jawahar reddy

అమరావతి, ఏప్రిల్ 10: ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాంటి వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహార్ రెడ్డిపై వేటు వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆర్ పి సిసోడియా లేదా నీరబ్ కుమార్ ప్రసాద్‌‌ల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. దీనిపై నేడు లేదా రేపు స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని ఈసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

AP Politics: అవినీతి నేలగా తణుకు, దోచిన సొమ్ముతో మంత్రి కారుమూరి ఫ్యాక్టరీలు పెట్టారు : పవన్ కల్యాణ్

అయితే జవహర్‌ రెడ్డి స్థానంలో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్‌పి సిసోడియా, రజత్‌ భార్గవ్‌, శ్రీలక్ష్మి, అనంతరామ్‌లతో కూడిన జాబితాను ఈసీ పరిశీలనకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా పంపినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలలో ఒకరికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం.


అయితే ఎన్నికల వేళ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. అదీకాక ఎన్నికల సమయంలో పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగులను ఏర్పాటు చేసి.. వారి ద్వారా లబ్దిదారులకు పెన్షన్ పంపిణీకి ఈ సీఎస్ జవహర్ రెడ్డి చర్యలు చేపట్టలేదు.

AP News: మనస్సు చాలా గాయపడింది

మరోవైపు సచివాలయాలకు వచ్చి లబ్దిదారులు పెన్షన్‌ తీసుకోవాలని వైసీపీ నేతలు క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. ఆ క్రమంలో పెన్షన్ కోసం వెళ్లిన పలువురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. అదీకాక సీఎస్ సీఎస్ జవహర్ రెడ్డి.. ఈ జగన్ ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా పని చేస్తున్నారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఇక సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు సైతం వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. దాంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి పక్కకు తొలగించేందుకు ఈసీ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆ క్రమంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాను పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాకు ఈసీ ఆదేశాలు ఇవ్వడం .. ఆ వెంటనే అయిదుగురి పేర్లతో కూడిన జాబితా పంపడం.. వారిలో ఇద్దరితో ఓ జాబితా సిద్ధం చేసి.. అందులో ఒకరి పేరు నేడో రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 10 , 2024 | 08:39 PM