ఏపీ అంటే అరాచకాలే
ABN , Publish Date - May 05 , 2024 | 04:00 AM
ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, దాడులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.
మహిళల మానాలు, దళితుల ప్రాణాలు తీస్తున్నారు
ఎన్డీఏ నేతల ధ్వజం
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, దాడులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతోన్న దౌర్జన్యాలను యామినీ శర్మ(బీజేపీ), ఆనంద్ సూర్య(టీడీపీ), శివశంకర్(జనసేన) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ‘ధర్మవరంలో బీజేపీ కార్యకర్తను వైసీపీ రౌడీలు దారుణంగా కొట్టారు. మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంట్లోకి దూరి కొట్టారు. అనకాపల్లిలో పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడి చేశారు. ఇవన్నీ వైసీపీ రాక్షస, అరాచక స్వభావానికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి’ అన్నారు. కాగా, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.