ప్రత్యేక చట్టాలతో భూసమస్యల పరిష్కారం
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:26 AM
రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన ప్రత్యేక చట్టాల ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఏపీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పి.సిసోడియా తెలిపారు.

రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా
ముదినేపల్లి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన ప్రత్యేక చట్టాల ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఏపీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పి.సిసోడియా తెలిపారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సిసోడియా మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ రెవెన్యూ చట్టాలకు సవరణలు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు లక్షా 50 వేల అర్జీలు అందాయని, అవసరమైతే సదస్సుల నిర్వహణను పొడిగిస్తామన్నారు.