AP Bar Council : న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 04:06 AM
ఏపీ బార్ కౌన్సిల్ బృందం నేతలు సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
సీఎంకు ఏపీ బార్‌కౌన్సిల్ వినతి
సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.10 లక్షలు సాయం
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఏపీ బార్ కౌన్సిల్ బృందం నేతలు సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షల డీడీని అందజేశారు. న్యాయవాదుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టులో బార్ కౌన్సిల్ కార్యకలాపాలకు కేటాయించిన స్థలం సరిపోవడం లేదని, బార్ కౌన్సిల్ కోసం అమరావతి జస్టిస్ సిటీలో 5 ఎకరాలను గుర్తించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం హైకోర్టులో ప్రస్తుతం ఉన్న 37 మంది న్యాయమూర్తుల సంఖ్యను 62కు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బార్ కౌన్సిల్ చైౖర్మన్ నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్.కృష్ణ మోహన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎ.రామిరెడ్డి, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, సభ్యులు ఉన్నారు.