‘బార్’లో ఎన్‌రోల్‌మెంట్‌కు నకిలీ సర్టిఫికెట్లు
ABN , Publish Date - May 17 , 2024 | 03:32 AM
విద్యార్హతకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరుగురు న్యాయవాదులపై ఏపీ బార్ కౌన్సిల్ వేటు వేసింది.
ఆరుగురు న్యాయవాదులపై వేటు
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): విద్యార్హతకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరుగురు న్యాయవాదులపై ఏపీ బార్ కౌన్సిల్ వేటు వేసింది. విశాఖపట్నానికి చెందిన టి.వెంకటనాయుడు, తూర్పుగోదావరిజిల్లా బొక్కావారిపాలెంకు చెందిన పితాని లక్ష్మీభాయి, పల్నాడుజిల్లా సత్తెనపల్లికి చెందిన బి.నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వరరావు, గుంటూరుకు చెందిన జొన్నకూటి సాంబశివరావు, కర్నూలు జిల్లా సింగవరంకు చెందిన కాటసాని సంజీవరెడ్డిని ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల జాబితా నుంచి తొలగిస్తూ బార్ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత ఉత్తర్వులు జారీ చేశారు.