Share News

AP Assembly: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!!

ABN , Publish Date - Jul 08 , 2024 | 07:31 PM

ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది.

AP Assembly: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!!

అమరావతి: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై సీఎం ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది.

Updated Date - Jul 08 , 2024 | 07:31 PM