Share News

విశాఖకు మరో వందేభారత్‌ రైలు

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:20 AM

విశాఖపట్నం ప్రయాణికులకు మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని భువనేశ్వర్‌ లేదా ఖుర్దా రోడ్‌ నుంచి విశాఖపట్నం వరకూ ఈ రైలును నడపనున్నారు.

విశాఖకు మరో వందేభారత్‌ రైలు

12న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

భువనేశ్వర్‌ లేదా ఖుర్దా నుంచి రాకపోకలు

విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ప్రయాణికులకు మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని భువనేశ్వర్‌ లేదా ఖుర్దా రోడ్‌ నుంచి విశాఖపట్నం వరకూ ఈ రైలును నడపనున్నారు. దీని రంగు ప్రస్తుత వందేభారత్‌లకు భిన్నంగా.. తెలుపు-నీలం రంగు కాకుండా నలుపు-ఆరెంజ్‌ రంగులో ఉంది. ఈ రైలును శుక్రవారం ట్రయల్‌ రన్‌ నడిపారు. ఖుర్దా రోడ్డు నుంచి ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం వచ్చింది. గంట సేపు స్టేషన్‌లోనే ఉంచారు. ఇది ఏయే స్టేషన్ల మధ్య, ఏయే సమయాల్లో నడుస్తుందనే వివరాలపై స్పష్టత లేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తారని వెల్లడించాయి.

Updated Date - Mar 09 , 2024 | 07:37 AM