Share News

భారంగా మారనున్న పశుపోషణ

ABN , Publish Date - May 20 , 2024 | 12:02 AM

వేసవి కాలం కావడంతో పశుగ్రాస కొరత పాడిరైతులను తీవ్రంగా వేధిస్తోంది.

భారంగా మారనున్న పశుపోషణ
ట్రాక్టర్‌లో తరలిస్తున్న వరిగడ్డి

ట్రాక్టర్‌ వరిగడ్డి రూ. 15 వేలు పశుగ్రాసం కొనాలంటే కష్టమంటున్న పాడిరైతులు

మదనపల్లె అర్బన, మే 19: వేసవి కాలం కావడంతో పశుగ్రాస కొరత పాడిరైతులను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పశుపోషణ భారంగా మారుతోందంటూ పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. మదనపల్లె మండలంలో 70శాతం రైతాంగం పాడిపశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పశుగ్రాసం కొనుగోలుపై రైతులు చాలా కష్టాలు ఎదు ర్కొంటున్నారు. మండలంలో వరిసాగు తక్కువగా ఉండడంతోపాటు పండినపంటలు చేతికి అందకపోవడంతో శ్రీకాళ హస్తి, ఏర్పేడు, కదిరి ప్రాంతాల నుంచి రైతులు పశుగ్రాసం కొనుగోలు చేస్తున్నారు. అయితే ట్రాక్టర్‌ వరిగడ్డి ధర రూ15 వేలు పలుకుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాడిపోషణకు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ప్రవేశపెట్టినా అవి సత్పలితాలను ఇవ్వకపోవడంతో పాడిరైతులకు పశుపోషణ భారంగా మారింది. పాడిపశువుల పాలధర రూ. 30 ఉండడం, అదే సమయం లో పాడిపోషణకు ఎక్కువ ఖర్చు కావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులను అన్ని విధాల ఆదుకునేలా ప్రభత్వం పాల కు గిట్టుబాటు ధర కల్పించాలని పాడిరైతులు కోరుతున్నారు. ప్రభు త్వం ప్రతిగ్రామంలో పశుగ్రాసం అందేలా చర్యలు తీసుకోవాలని పాడి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

సబ్సిడీపై వరిగడ్డి అందజేయాలి

పాడిరైతులకు వరిగడ్డి సబ్సిడీపై సరఫరా చేయాలి. పాడిపోషణ లేకపో తే రైతులు చాలా ఇబ్బందులు పడుతారు. ప్రస్తుతం పశువుల కోసం అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయకతప్పడంలేదు రైతులకు. దీం తో పాలలో వచ్చే ఆదాయం పశుపోషణకే సరిపోతోంది. కావున ప్రభుత్వం సబ్సిడీపై వరిగడ్డి సరఫరా చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది

-ఎం. ప్రభాకర్‌, సర్పంచ చీకలబైలు, మదనపల్లె మండలం

Updated Date - May 20 , 2024 | 12:02 AM