Share News

ఐఎంఏ రాష్ట్ర శాఖకు జాతీయ పురస్కారాలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:10 AM

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) 99వ జాతీయ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్‌ శాఖ సభ్యులకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి.

ఐఎంఏ రాష్ట్ర శాఖకు జాతీయ పురస్కారాలు

గవర్నర్‌పేట, డిశంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) 99వ జాతీయ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్‌ శాఖ సభ్యులకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి. హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైన మహాసభలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు (నంద్యాల) డాక్టర్‌ గుర్రాల రవికృష్ణకు సామాజిక సేవలో డాక్టర్‌ జ్యోతిప్రసాద్‌ గంగూలీ స్మారక పురస్కారం, చెవి, ముక్కు, గొంతు వైద్యనిపుణులు డాక్టర్‌ మధుసూదనరావు (నంద్యాల)కు ఐఎంఏ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఐఎంఏలో జాతీయ స్థాయిలో సేవలు చేసిన సేవలకు డాక్టర్‌ రాయపు రమేష్‌ (తిరుపతి)కు డాక్టర్‌ ఏకెఎన్‌ సిన్హా పురస్కారం లభించింది. గత రెండు సంవత్సరాలుగా ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన డాక్టర్‌ పోలవరపు ఫణిధర్‌, ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించిన కావలి ఐఎంఏ శాఖకు, ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి (గుంటూరు), మహిళా విభాగం నుంచి డాక్టర్‌ హేమలత (అనంతపురం), రాజమండ్రి ఐఎంఏ శాఖ కార్యదర్శి డాక్టర్‌ పిడుగు విజయభాస్కర్‌కు ఐఎంఏ జాతీయ అధ్యక్షుని ప్రత్యేక ప్రశంసాపత్రాలు లభించాయి. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోకన్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అనీల్‌ నాయక్‌, నూతన అధ్యక్షుడు డాక్టర్‌ భానుషౌలి నుంచి వీరు పురస్కారాలు అందుకున్నారు. జాతీయ పురస్కారాలు అందుకున్న వారిని ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ నందకిషోర్‌, డాక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, నాయకులు వీఎస్‌ ప్రసాద్‌, శ్రీహరిరావు, డాక్టర్‌ పిఎస్‌ శర్మ, డాక్టర్‌ రాంప్రసాద్‌, డాక్టర్‌ కిషోర్‌, డాక్టర్‌ మూర్తి, శ్రీనివా్‌సరాజు, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం అభినందించారు.

Updated Date - Dec 29 , 2024 | 05:10 AM