Share News

రాజ్యాంగ రచనలో తెలుగు వారి పాత్ర చిరస్మరణీయం

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:07 AM

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 2025వ సంవత్సరానికి నూతన కేలండర్‌ను ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థ ప్రత్యేకంగా రూపొందించింది.

రాజ్యాంగ రచనలో తెలుగు వారి పాత్ర చిరస్మరణీయం

అసెంబ్లీ కేలండర్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 2025వ సంవత్సరానికి నూతన కేలండర్‌ను ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థ ప్రత్యేకంగా రూపొందించింది. ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా ఆ కేలండర్‌ను తీర్చిదిద్దింది. ఈ వినూత్న కేలండర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన నాయకులను, దార్శనికులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని, రాజ్యాంగ రచనలో వారి పాత్ర చిరస్మరణీయమని సీఎం అన్నారు. ఆ ప్రముఖుల గొప్పతనాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

సామాజిక మాధ్యమాల్లో శాసన వ్యవస్థ సమాచారం

ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ‘ఎక్స్‌’, యూట్యూబ్‌లో ఃఔ్ఛజజీటఅుఽఛీజిట్చ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా శాసనవ్యవస్థ సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, శాసనవ్యవస్థ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 05:07 AM