ఇక.. ‘చంద్రన్న బీమా’
ABN , Publish Date - Jun 26 , 2024 | 02:17 AM
చంద్రన్న బీమా పథకాన్ని ప్రభుత్వం మళ్లీ అమలు చేయబోతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు.
వెంటనే ఫైల్స్ సిద్ధం చేయాలని కార్మిక మంత్రి సుభాష్ ఆదేశం
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): చంద్రన్న బీమా పథకాన్ని ప్రభుత్వం మళ్లీ అమలు చేయబోతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనల ఫైల్‌ను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. కార్మిక శాఖపై మంగళవారం సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో సబ్సిడీ, మెటర్నిటీ, ఎడ్యుకేషన్‌లో సబ్సిడీ ఉండేదని, వాటిని తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు ఫైల్స్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు.
ఈఎ్‌సఐ డైరెక్టర్ వి.ఆంజనేయులు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్, బాయిలర్ల డైరెక్టర్ ఉమామహేశ్వర్, లేబర్ వెల్ఫేర్ కమిషనర్ రాణి పాల్గొన్నారు.